సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు మొదటి ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వాలీబాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సిరిసిల్ల పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ప్రారంభించిన జిల్లా స్థాయి ఆహ్వానిత వాలీబాల్ టోర్నమెంట్ గురువారం సాయంత్రం ముగిసింది. శాట్ ఏ జట్టు మొదటి స్థానం, సిరిసిల్ల వీబీఏ జట్టు రెండవ స్థానం, గంభీరావుపేట జట్టు మూడవ స్థానం, రుద్రంగి జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. బహుమతుల ప్రదానం మహోత్సవానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విస్ ఆది శ్రీనివాస్ మాట్లాడ్లారు. గ్రామీణ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించడానికి తన సహకారం ఉంటుందన్నారు. అనంతరం విజేత జట్టులకు ముఖ్య అతిథులు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయం జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, టౌన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణగౌడ్, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాందాస్, ఉపాధ్యక్షులు చింతకింది శ్యాంకుమార్, గంగ మహేష్, డీ లక్ష్మీనారాయణ, కోశాధికారి కోడం శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మణ్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Related Post