2028 సీజన్ నుండి ఐపీఎల్ సీజన్‌ను 94 మ్యాచ్‌లకు విస్తరించాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. అయితే మ్యాచ్‌ల సంఖ్య పెంచినా కొత్త జట్లను తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. 2022లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లను ఐపీఎల్‌లో చేర్చిన బీసీసీఐ, మ్యాచ్‌ల సంఖ్యను 74కు పెంచింది. ప్రస్తుతం సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యను 84కు పెంచాలని అనుకున్నప్పటికీ అంతర్జాతీయ బిజీ షెడ్యూల్ కారణంగా చివరి నిమిషంలో దాన్ని రద్దు చేశారు. ఐపీఎల్ కోసం FTP (ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్)లో IPL విండోను మార్చి మధ్య నుండి మే చివరి వరకు వచ్చే రెండు సీజన్లకు నిర్ణయించారు.
అయితే రానున్న కాలంలో అంటే 2028 సీజన్ నుంచి మ్యాచ్‌ల సంఖ్యను ఏకంగా 94కు పెంచాలని బీసీసీఐ, ఐపీఎల్ కమిటీ భావిస్తోంది. ఇదే విషయంపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. “మేం ఐసీసీతో చర్చిస్తున్నాం. అలాగే బీసీసీఐలో కూడా అంతర్గతంగా చర్చిస్తున్నాం. ద్వైపాక్షిక, ఐసీసీ ఈవెంట్లు, ఫ్రాంచైజ్ క్రికెట్ సంబంధించి అభిమానుల ఆసక్తి ఎలా మారుతుందో చూస్తే.. కచ్చితంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచాలని అనుకుంటున్నాం.” అని ఆయన అన్నారు.
ఐపీఎల్ కోసం షెడ్యూల్‌లో పెద్ద విండో కోరుకుంటున్నాం, దాంతో మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 84 లేదా 94కి పెంచవచ్చు. అలా పెంచితేనే.. ప్రతి టీమ్ సగం మ్యాచ్‌లు హోం గ్రౌండ్‌లో, సగం మ్యాచ్‌లు ప్రత్యర్థి హోం గ్రౌండ్‌లో ఆడేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి టీమ్ మిగతా టీమ్స్ రెండేసి మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం ఉంటుంద అని ఆయన అన్నారు. మరి బీసీసీఐ అడగాలే కానీ, ఐసీసీ కచ్చితంగా ఐపీఎల్ కోసం ఎక్కువ టైమ్ ఇవ్వడం పక్కా. అదే జరిగితే 2028 నుంచి 94 ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..