
క్రమశిక్షణతో చదివి విద్యార్థులు ఉత్తములు కావాలని ప్రధానోపాధ్యాయులు జంగం అశోక్ అన్నారు. మండలంలోని తొర్లి కొండ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జంగం అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తములు కావాలని ఉద్బోధించారు . అనంతరం విద్యార్థిని విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరికృష్ణ సంతోష్ కుమార్ విజయలక్ష్మి లలిత తదితరులు పాల్గొన్నారు.