ఫాంటసీ, మ్యాజికల్ అంశాలతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్ టుక్’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందిన ఈ చిత్రానికి సి.సుప్రీత్ కష్ణ దర్శకుడు. చిత్రవాహిని, ఆర్‌వైజి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి నిర్మించారు. ఈనెల 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ వైభవంగా నిర్వహించారు. దర్శకుడు సుప్రీత్ సి. కష్ణ మాట్లాడుతూ, ‘టీజర్‌కు, ట్రైలర్‌కు, ఏఐ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈనెల 21న అందరూ ఓ కొత్త తెలుగు సినిమా చూడబోతున్నారు. ఓ కమర్షియల్ ప్యాకేజీలో ఇలాంటి సినిమా చేయడం గొప్పగా అనిపించింది. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. రోషన్ నటించిన ‘కోర్టు’ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా రోషన్ ఓ మంచి పాత్రను చేశాడు. తప్పకుండా కోర్టు సక్సెస్ మా సినిమాపై కూడా రిఫ్లెక్ట్ అవుతుంది’ అని అన్నారు. ‘ఫాంటసీ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈనెల 21న చిత్రాన్ని అందరూ థియేటర్‌లో చూసి ఎంజారు చేయాలని కోరుకుంటున్నాం’ అని నిర్మాతల్లో ఒకరైన రాహుల్ రెడ్డి చెప్పారు.

‘కోర్టు’ విజయం మాకు ప్లస్ అవుతుంది
Written by RAJU
Published on: