కరీంనగర్ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి. మంకమ్మతోటలో వృద్ధురాలిని వెంటాడి మరీ దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో కోతులు వీరంగం సృష్టిస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా కోతుల బెడదతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మంకమ్మతోటలో వృద్దురాలుపై కోతులు దాడి చేశాయి. ఇంటిముందు నిల్చున్న వృద్ధురాలు ఆగమ్మ కొంగుపట్టి ఓ కోతి లాగగా, మరో కోతి ఆమెపై దూకి కింద పడేశాయి. ఒక్కసారిగా పదుల సంఖ్యలో కోతులు ఎగబడ్డాయి. వెంటనే స్థానికులు కర్రలు పట్టుకుని అరుస్తూ బెదిరించడంతో కోతులు ఆమెను వదిలిపెట్టాయి. లేకుంటే వృద్ధురాలి ప్రాణం తీసేవి.
అటు సైదాపూర్ మండలం కేంద్రంలోని వెంకేపల్లి లో వానర సైన్యం దండు కట్టి ఘర్షణ పడ్డాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన కోతులు పరస్పరం ఘర్షణ పడి గ్రామస్తులను భయాందోళనకు గురిచేశాయి. దారిలోనే కిష్కిందకాండల వానర సైన్యం ఘర్షణ పడడంతో దాదాపు రెండు గంటల పాటు రాకపోక నిలిచిపోయాయి. కోతుల బెడదతో వేగలేక పోతున్నామని, అధికారులు కోతులు నివారించే చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. కరీంనగర్ నగరంలో తరుచూ కోతులు జనంపై దాడికి దిగుతున్నాయి. బయట రావాలంటే జనం భయపడుతున్నారు. కోతుల నుంచి తమకు విముక్తి కల్పించాలని నగర వాసులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..