టీడీపీ అధినేత, సీఎం చంద్ర బాబుకు ఒకప్పుడు పశ్చిమ గోదావరికి చెందిన ఓ ఫైర్ బ్రాండ్ నేత ..కొరుకుడు పడకుండా ఉండేవా రన్న పేరుంది. ఆయన రాజకీయాల్లోనే ఫైర్ కాకుండా వ్యక్తిగతంగా కూడా ఫైర్ అనే మాటను సొంతం చేసుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి గత ఏడాది ఎన్నికలకు ముందు.. చంద్రబాబు బలమైన హామీలు తీసుకుని .. ఆయనకు టికెట్ ఇచ్చారు. దీంతో సదరు ఫైర్ బ్రాండ్ తగ్గి.. ప్రజల మధ్య, పార్టీ అధినేత మధ్య నెగ్గుతున్నారు. మరి ఈయనతో పోల్చుకుంటే.. కొత్తగా రాజకీయా ల్లోకి వచ్చిన ఎస్సీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు ఎంత? అనేది టీడీపీ నాయకులు సంధిస్తున్న ప్రశ్న.
నిరంతర వివాదాలు, విమర్శలతో కాలం వెళ్లదీసే.. కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదానికి కేంద్రంగా మారారు. సీనియర్ నాయకుడు, టీడీపీ యువ నేత రమేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నది ఆయన డిమాండ్. అయితే..ఏదైనా ఉంటే.. పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకునే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. సాక్షత్తూ సీఎం చంద్రబాబు కూడా చెబుతున్నారు. “అయినప్పటికీ..కొలికపూడి తానే `సర్వంసహా చక్రవర్తి` అనుకుంటున్నాడో.. లేక.. తాను ఏం చేసినా ఫర్వాలేదని విర్రవీగుతున్నాడో మాకు అర్థం కావడం లేదు. ఇలాంటివారు చెద పురుగులు“ అని తిరువూరుకే చెందిన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
ఇక, తాజాగా జరిగిన ఘటనపైనా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ దఫా కొలికపూడిని వదిలేది లేదన్నట్టుగానే చంద్రబాబు వ్యవహరించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఇప్పటికే నాలుగు సార్లకు పైగా.. ఆయనకు అవకాశం ఇచ్చారు. అప్పట్లో ప్రతి సందర్భంలోనూ పార్టీ సీనియర్లు ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయిన ప్పటికీ కొలికపూడి మారలేదు. మార్పు రాలేదు. ఇక, ఇప్పుడు పార్టీ ఆయనను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి ఎస్సీ నాయకుడు, ఆయనకు ఆయన మేధావి అని చెప్పుకొనే కొలికపూడిని చంద్రబాబు భుజాలపైకి.. తర్వాత తలపైకి కూడా ఎక్కించుకున్నారు.
తిరువూరు టికెట్‌ను సౌమ్యుడు, మాజీ మంత్రి జవహర్ ఆశించినా.. ఆయనను పక్కన పెట్టి మరీ కొలికపూడికి ఇచ్చారు. గెలిపిం చుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు కొరకరాని కొయ్యగా ఆయన మారాడు. అయితే.. ఇప్పుడు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నా.. లేక క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నా..అనేక సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గంపై చంద్రబాబు చర్యలు తీసుకున్నారన్న ప్రచారం తెరమీదకు వస్తుందన్న ఆవేదన ఒకవైపు ఉంది. అలాగని వదిలేస్తే.. మరింత మంది రెచ్చిపోయేందుకు.. కొలికపూడి దారి చూపినట్టు అవుతుందన్న బెంగా ఉంది. ఈ రెండు పరిణామాలతో అటు చర్యలు తీసుకోలేక.. ఇటు.. మౌనంగా ఉండలేక చంద్రబాబు మథన పడుతున్నారన్నది వాస్తవం.
The post కొలికపూడిని పట్టలేరు.. వదల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్.. ! first appeared on namasteandhra.