
కొమ్మాల అంగడి వేలంలో నందనాయక్ తండా , విశ్వనాధపురం , కొమ్మాల , రత్తి రామ్ తండా , దశ్రు తండా గ్రామాలకు కలిపి సంవత్సరానికి 52 వారాలుగా కేటాయిస్తారు. ఇందులో బాగంగా కొమ్మాల 20 వారాలకు గాను సీల్డ్ కవర్ ద్వారా…48,51,396 కాగా 49,01,000 ఓపెన్ టెండర్ లో కొమ్మల గ్రామానికి చెందిన బాలోజీ నాగయ్య టెండర్ కైవసం చేసుకున్నారు.ఇంకా విశ్వనాధపురం, నదనాయక్ తండా , రత్తిరాం తండా , దశ్రు తండా గ్రామాల వాట వేలం జరగాల్సింది. ఈ కార్యక్రమంలో ఎంపీవో అడేపు ప్రభాకర్ ,కార్యదర్శి శంకర్రావు మరియు టెండర్ దారులు పాల్గొన్నారు.