
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోనాపూర్ సింగిల్ విండో చైర్మన్ బడాల రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం కోనాపూర్ లో స్థానిక సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం విక్రయించడం ద్వారా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2320, బి గ్రేడ్ ధాన్యానికి రూ. 2300 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రతి రైతు వరికి 17 శాతం మ్యాచరు వచ్చేటట్టు చూడాలని రైతులను కోరారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ దయ్య దేవయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ చిన్నారెడ్డి, సొసైటీ డైరెక్టర్ లు, సొసైటీ కార్యదర్శి నాగరాజు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.