కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి

Written by RAJU

Published on:

– తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య
నవతెలంగాణ-మల్హర్ రావు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము చైర్మన్ ఇప్ప మొoడయ్య సూచించారు. బుధవారం పిఏసిఎస్ ఆధ్వర్యంలో మండలంలోని తాడిచెర్ల, పెద్దతూoడ్ల,అడ్వాలపల్లి,దుబ్బపేట గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పిఏసిఎస్ చైర్మన్ మాట్లాడారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్యాడి క్లీనర్స్ లేదా ఇతర పద్ధతుల ద్వారా తూర్పల చేసిన తర్వాత తేమ శాతం 17 మించకుండా వచ్చిన తర్వాత కొనుగోలు చేయటం జరుగతుందన్నారు.ప్రభుత్వ గ్రేడ్ ఏ ధర క్వింటాలుకు రూ.2320, గ్రేడ్ బి క్వింటాలుకు రూ.2300 ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దతూoడ్ల,అడ్వాలపల్లి గ్రామశాఖల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కుల వెంకటస్వామి యాదవ్,అజ్మీరా రాజు నాయక్,యూత్ కాంగ్రెస్ నాయకుడు మండల రాహుల్,అడ్వాల మహేష్,శ్రీనివాస్, రాజు నాయక్,కిషన్ నాయక్,నర్సింగరావు,వ్యవసాయ ఏఈ,పిఏసిఎస్ సిబ్బంది, హమాలీలు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights