సన్నహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే జిల్లా నుంచి పలు ప్రతిపాదనలు
కొత్త స్టేషన్‌లతో పాటు అప్‌గ్రేడేషన్ కూడా
మంచిర్యాలలో కొత్తగా 2-టౌన్ పీఎస్ ఏర్పాటు
మంచిర్యాల, మార్చి8 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసు శాఖ సమాయత్తం అవుతోం ది. ఇందులో భాగంగా కొత్త పోలీసు స్టేషన్ల ఏ ర్పాటుతో పాటు ఉన్న వాటికి అప్‌గ్రేడేషన్ చేయ డానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రజా స మస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పై చర్యలకు శ్రీకారం చుడుతోంది. జిల్లాలో కొత్త పో లీసు స్టేషన్‌లు, అప్‌గ్రేడేషన్లకు సంబంధించి అ ధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు.
మంచిర్యాలలో 2-టౌన్ ఏర్పాటుకు చర్యలు…
జిల్లా కేంద్రంలో 2-టౌన్ పోలీసు స్టేషన్ ఏ ర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాల కాలంగా ఉంది. టౌన్ పెద్దదికావడం, క్రైం రేట్ కూడా ఎ క్కువ ఉండడంతో ఇక్కడ కొంత మేర లా అండ్ ఆర్డర్ సమస్య తరచుగా తలెత్తుతోంది. మంచి ర్యాల పట్టణం టౌన్-1, టౌన్-2గా ప్రజలు పిలు పుస్తుంటారు. టౌన్-1తో సమానంగా టౌన్-2 కూ డ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధి తో పాటు క్రైం రేట్ కూడా పెరుగుతుండడంతో టౌన్-2గా పిలువబడే హమాలీవాడ ప్రాంతం కేంద్రంగా ప్రత్యేకంగా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పె ట్టుకొని 2024 ఆగస్టులో పోలీసుశాఖ ఉన్నతాధి కారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశా రు. మంచిర్యాల పట్టణంలో ప్రస్తుతం 2లక్షలపై చిలుకు జనాభ ఉంది. టౌన్-1, టౌన్-2లో దాదా పుగా సమానంగా లక్ష చొప్పున జనాభ ఉంటుం ది. మొత్తంగా రెండులక్షల జనాభకు సంబంధిం చి ప్రస్తుతం ఒకే ఒక్క పోలీసు స్టేషన్ ఉండడం తో సమస్యల పరిష్కారానికి సకాలంలో చర్యలు చేపట్టలేకపోతున్నారు. హమాలీవాడ కేంద్రంగా మరో పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయమై పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్న తాధికారులు కూడ హామీలు ఇచ్చినప్పటికీ ఏళ్లు గడిచినా నెరవేరడం లేదు. టూటౌన్ పోలీసు స్టే షన్ ఏర్పాటు విషయమై స్థానిక ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల డంతో ఎట్టకేలకు మార్గం సుగమం అయింది.
అత్యధిక క్రైం రేట్ నమోదు…
ప్రస్తుతం మంచిర్యాల పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఏడాదికి సగటున క్రైం రేటు వెయ్యి వరకు ఉంటుంది. వ్యాపార కేంద్రం విరాజిల్లుతు న్న జిల్లా కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి దిన దినాభివృద్ధి సాధిస్తోంది. పట్టణ పరిసర ప్రాంతా ల్లో విరివిగా నివాస గృహాలు వెలుస్తుండగా ప్ర జల సంచారం అధికమైంది. లాడ్జీలు, హోటళ్లు, ఆసుపత్రులు పదుల సంఖ్యలో ఏర్పడగా నిత్యం వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చిపోయేవారి సంఖ్య కూడ అధికంగా ఉంటోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టే ట్ వ్యాపారం జోరుగా సాగుతుండగా, అదే స్థా యిలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సా ధారణంగా ఆరువందల వరకు క్రైం రేటు ఉంటే ఒక పోలీసు స్టేషన్ పరిధిలో పరిపాలన సుల భంగా ఉంటుంది. కాని మంచిర్యాలలో అంతకు రెట్టింపు ఉండడంతో సమస్య తీవ్రంగా ఉంది.
2-టౌన్ ఏర్పాటుతో ప్రజా సమస్యలకు పరిష్కారం…
హమాలీవాడ కేంద్రంగా 2-టౌన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్న ద్ధం అవుతున్నారు. ప్రభుత్వం నుంచి అధికారి కంగా ఉత్తర్వులు వెలువడగానే కార్యచరణ ప్రా రంభించేందుకు పోలీసుశాఖ ఏర్పాట్లు చేస్తోంది. హమాలీవాడలో ప్రత్యేకంగా సీఐ స్థాయిలో పో లీసు స్టేషన్ ఏర్పాటు కానుండగా ఎస్‌ఐలు, ఏఎఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితర సిబ్బంది మొత్తంగా 55 మంది వరకు ఉండనున్నారు. మంచిర్యాల డివిజన్‌లో డిగ్రేడ్‌తో కూడిన టౌన్-1తో సమానంగా టౌన్-2 పోలీసు స్టేషన్ ఏర్పాటు కానుంది.
నస్పూర్ పీఎస్ అప్‌గ్రేడేషన్ కూడా…
నస్పూర్ పోలీసు స్టేషన్ కూడా ఉన్నతీకరిం చేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన లు అందజేశారు. ప్రస్తుతం నస్పూర్ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు నిర్వ ర్తిస్తుండగా అది ఈ-గ్రేడ్‌లో ఉంది. ఆ పోలీసు స్టేషన్‌ను సీఐ స్థాయిలో ఎస్‌హెచ్‌వోగా అప్‌గ్రేడ్ చేస్తూ డి-గ్రేడ్‌కు మార్చనున్నారు. అక్కడ పీఎస్ లో సీఐతో కలిపి 55 మంది సిబ్బంది విధులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నారు. న స్పూర్ పరిధిలో కలెక్టరేట్‌తో పాటు జనాభ కూడ అధికంగా ఉండడంతో క్రైం రేట్ కూడ ఎక్కువ మొత్తంలోనే నమోదు అవుతోంది. దీంతోపోలీసు స్టేషన్ అప్‌గ్రేడ్ చేయాలనే నిర్ణయానికి అధికా రులు వచ్చారు. నస్పూర్ పోలీసు స్టేషన్‌ను అప్ గ్రేడ్ చేయడం వల్ల అక్కడి ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి.
ప్రతిపాదనలు పంపించాం…
మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2-టౌన్ పోలీసు స్టేషన్‌తో పాటు నస్పూర్ పీఎస్ అప్‌గ్రేడేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. పెరుగుతున్న క్రైం రేట్‌కు అనుగుణంగా ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించా ము. ప్రస్తుతం ఉన్న మంచిర్యాల టౌన్-1 పోలీ సు స్టేషన్‌కు అదనంగా హమాలివాడలో టౌన్- 2, నస్పూర్‌లో అప్‌గ్రేడేషన్ చేయడం వల్ల ప్రజ ల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిం చడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ సులభ తరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Updated Date – Mar 08 , 2025 | 11:28 PM