మీరు తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో బంపర్‌ఆఫర్..! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మెగా సేల్‌ను ప్రకటించింది. ‘పే డే సేల్’ ప్రకారం ప్రయాణీకులు రూ.1,429 నుండి విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవడానికి ఎటువంటి అదనపు ఛార్జీలు విధించబడవు. ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీతో, ప్రయాణీకులు అదనపు ఖర్చు లేకుండా 3 కిలోల క్యారీ-ఆన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనితో పాటు, చెక్-ఇన్ బ్యాగేజీపై ప్రత్యేక తగ్గింపులు కూడా ఇస్తున్నారు. ఇందులో దేశీయ విమానాలకు 15 కిలోల బ్యాగేజీ రూ. 1,000 కు, అంతర్జాతీయ విమానాలకు 20 కిలోల బ్యాగేజీ రూ. 1,300 కు అందుబాటులో ఉంటుంది.
ఆ విమానయాన సంస్థ రెండు ధరలకు టిక్కెట్లను అందిస్తోంది.
ఇవి కూడా చదవండి
1. ఎక్స్‌ప్రెస్ వాల్యూ రేటు: కేవలం 1,499 నుండి ప్రారంభమవుతుంది, ఇందులో అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
2. ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీ: 1,429 నుండి ప్రారంభమవుతుంది (చెక్-ఇన్ బ్యాగేజీ మినహా).
విమానయాన సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.airindiaexpress.com లేదా అధికారిక మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మార్చి 28 నుండి మార్చి 31, 2025 వరకు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ప్రయాణీకులు ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 20, 2025 వరకు ప్రయాణాలకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
Make the most of your #Payday! ✈ Enjoy flat 15% OFF your next trip. Book till 31 Mar 2025 and travel till 20 Sep 2025
Book now on https://t.co/rMBTOFB9H1 and enjoy #FastBookings, #FabDeals, and #FantasticValue! pic.twitter.com/FE5nJd2ajK— Air India Express (@AirIndiaX) March 28, 2025
అయితే, ఈ ఆఫర్ మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే ఈ ఆఫర్ ఇవాళ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ గడువులోపుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని గమనించాలి.
మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..