ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టనున్నట్లు వెల్లడించింది. సర్వేలకు బదులుగా పారదర్శకంగా కులగణన చేపట్టి, జనాభా లెక్కల్లో కులగణనను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటే సిల్చార్-షిల్లాంగ్ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం, 166.8కి.మీ మేర రూ.22,864 కోట్లతో కారిడార్ నిర్మాణం, చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం, క్వింటాకు రూ.355 ఎఫ్‌ఆర్‌పీ పెంపు, అసోం-మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి