ABN
, Publish Date – Mar 24 , 2025 | 12:44 AM
కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్ చేస్తున్న తప్పుడు ఆరోపణలు తిప్పి కొట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ అన్నారు.

సిరిసిల్ల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్ చేస్తున్న తప్పుడు ఆరోపణలు తిప్పి కొట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కే కన్వేన్షన్ హాల్‌లో ఏఐ సీసీ, పీసీసీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అమలు పై జిల్లాస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. తెలంగాణ ఉర్దూ అకా డమీ చైర్మన్ తహీర్‌బిన్, ఏఐసీసీ జాతీయ కోఅర్డీనేటర్ రుద్ర సంతోష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల కాం గ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పోగ్రాం కోఆర్డినేటర్ అవేశ్‌ఖాన్‌లతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆనాడు బీఆర్‌ఎస్ ఒక్కరోజులో కుల గణన చేసి చేతు లు దులుపుకుందన్నారు. బీఆర్‌ఎస్ చేసిన సర్వేలో బీసీల జనాభా 51 శాతంగా ఉండగా, ఇప్పుడు 56శాతంగా ఉందన్నారు. కామారెడ్డి డిక్లరే షన్‌లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి మాట నిలుపుకుందన్నారు. 2025లో జరిగే దేశ జనాభా లెక్కింపులతో పాటు కుల గణన చేయాలని అన్నారు. బీజేపీకి గత ఎన్నికల్లో 400 సీట్లు వస్తే దేశంలో రాజ్యాంగాన్ని మార్చడం ఎజెండాగా పెట్టుకుందని అన్నారు. రాహూల్‌గాంధీ పాదయాత్రు చేపట్టి దేశంలో ఉన్న వివక్షను రూపుమాపడం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. బీజేపీ విధి విధా నాలను ఎండగడుతూ ముందుకు పోవాలన్నారు. గత పది సంవత్సరా ల్లో బీఆర్‌ఎస్ ఒక్క పథకానికి సరైన పాలసీ తేలేదన్నారు. రాష్ట్రం నుం చి పన్నుల రూపంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి పంపిస్తున్న డబ్బుల్లో మనకు ఏమి ఇవ్వడం లేదన్నారు. 30సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు అమోదించుకున్నామన్నారు. రాష్ట్రంలో రెండు చారిత్రా త్మక బిల్లులు ఆమోదం పొందడంలో భాగస్వామ్యం కావడం సంతో షంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మాజీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూప, కాంగ్రెస్ నాయకులు గడ్డం నర్సయ్య, మహిళ కాంగ్రెస్ అధ్య క్షురాలు వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, వివిధ మం డలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Updated Date – Mar 24 , 2025 | 12:44 AM