కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం – Telugu Information | 900 Automobile Engines Disappear at Kia Manufacturing facility, Sri SatyaSai Dist In Andhra Pradesh

Written by RAJU

Published on:

శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి. ఈ క్రమంలో చోరీ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కియా సంస్థకు అవసరమైన విడి భాగాలు విభిన్న ప్రాంతాల నుండి సరఫరా అవుతుంటాయి. ఇందులో భాగంగా, కారు ఇంజిన్లు తమిళనాడు నుండి వస్తుంటాయని తెలిసింది. ఆ మార్గంలో ఎక్కడైనా చోరీ జరిగిందా? లేక పరిశ్రమకు చేరిన తర్వాతే అవి దొంగిలించబడాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కేసు దర్యాప్తు తుదిదశకు చేరినట్టు సమాచారం. త్వరలో అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights