నవతెలంగాణ -తాడ్వాయి : జమ్ము కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై యావత్ దేశం భగ్గుమంది. అందులో భాగంగా బుధవారం సాయంత్రం బిజెపి మండల అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, బిజెపి నాయకులు, యూత్ నాయకులు గ్రామస్తులు, పోలీస్ శాఖ అధికారులు కూడా తెలియజేస్తూ ర్యాలీ చేపట్టారు. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై ప్రతికాలం తీర్చుకోవాలని నినాదాలు చేశారు. టెర్రర్ అటాక్ ను అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదన్నారు. మనం దీనిని అధిగమిద్దామని.. కలిసి, మనం కోలుకుందామని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి శ్రేణులు, యూత్ నాయకులు, పోలీసులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.