
త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరగజ్జ’. కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, ‘ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. గత చరిత్రను తెలుసుకున్నాం. దీనికి అనుగుణంగా సంగీతంలో కొత్త ప్రయోగాల్ని చేయాల్సి వచ్చింది. నాటి ఆచారాలను, సంప్రదాయాల్ని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈ ట్యూన్స్ వచ్చాయి. ‘కొరగజ్జ’ కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది. ఈ చిత్రం నాకు ఎంతో సవాలుగా అనిపించింది. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయి. వీటిని వివిధ శైలి, భాషల్లో స్వరపరిచాను. ఈ పాటలకు సుధీర్ అత్తవర్ స్వయంగా సాహిత్యం అందించారు. శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ ఖాన్, అర్మాన్ మాలిక్ వంటి ప్రతిభావంతులైన గాయనీగాయకులతో ఇందులో పాటల్ని పాడించాను’ అని తెలిపారు. ”కాంతార’ సినిమా కంటే ఎంతో భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. వేల దేవతలకు నిలయమైన కర్ణాటక, కేరళ గొప్ప సాంస్కతిక వారసత్వంలో ‘కాంతార’ ఒకరిని మాత్రమే చూపించింది. ఆ సినిమా తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం మల్టీ లాంగ్వేజెస్‌లో విడుదల కానుంది’ అని దర్శకుడు చెప్పారు.