కాంగ్రెస్‌లో మంత్రి పదవుల పంచాయితీ.. ప్రేమ్‌సాగర్ వ్యాఖ్యలపై వివేక్ ఏమన్నారంటే..? – Telugu Information | Telangana Congress Minister Row: Adilabad MLA Struggle Over Cupboard Berth – Political Movies in Telugu

Written by RAJU

Published on:

కాంగ్రెస్‌లో మంత్రి పదవుల కోసం పంచాయితీ ముదురుతోంది. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరిగితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి? దీనిపైనే కాంగ్రెస్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోతే ఉమ్మడి ఆదిలాబాద్‌కు అన్యాయం చేసినట్టే అంటున్నారు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు. కాంగ్రెస్ వల్లే వివేక్ వెంకటస్వామి కుటుంబం లాభపడిందని.. పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు అడిగే అర్హత ఎక్కడిది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్లే వివేక్ కుటుంబం లాభపడిందన్నారు.

అయితే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్‌ గెలుపు కోసమే తిరిగి పార్టీలోకి వచ్చామన్నారు. మంత్రి పదవిపై ఆశతో కాంగ్రెస్‌లోకి రాలేదన్నారు. పనిచేసేది ఎవరో ప్రజలకు తెలుసన్న ఆయన.. పదవులు ఎవరికివ్వాలో పార్టీ హైకమాండ్‌కు తెలుసని వ్యాఖ్యానించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights