‘కమిటీ కుర్రోళ్లు’ సెన్సేషనల్‌ హిట్‌ తర్వాత..

Written by RAJU

Published on:

‘కమిటీ కుర్రోళ్లు’ సెన్సేషనల్‌ హిట్‌ తర్వాత..2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నటి, నిర్మాత నిహారిక కొణిదెల మంచి విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్‌ చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్తవారే కావటం విశేషం. తాజాగా ఆమె తన సొంత నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న సంగీత్‌ శోభన్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో వెల్లడికానున్నాయి. ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్‌ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్‌ శోభన్‌, డైరెక్టర్‌ మానస శర్మ భాగమయ్యారు. జీ5తో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్‌ రూపొందించిన ‘బెంచ్‌ లైఫ్‌’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా ఆంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్‌ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించారు. మన్యం రమేష్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Subscribe for notification
Verified by MonsterInsights