పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు ఇక్కట్లు
(ఆంధ్రజ్యోతి-కూచిపూడి): పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు లేక ఉపాధి కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు టెంట్లు, దాహార్తిని తీర్చుకునేందుకు మంచినీటి సౌకర్యం, పని చేసేడప్పుడు గాయాలైతే ప్రాథమిక చికిత్సకు అవసరమైన కిట్లు లేవు. దీంతో నానా అవస్థలు పడుతున్నారు. మొవ్వ మండలంలో 21 పంచాయతీలు ఉండగా, రోజూ 3 వేల మంది కూలీలు ఉపాధి పనుల్లో పా ల్గొంటున్నారు. పంట బోదెల తవ్వకం, శ్మశాన వాటికల అభివృద్ధి, ముళ్లకంప ల తొలగింపు, ప్రభుత్వ స్థలాల మెరక పనులు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో 30 రోజులకు మించి పనిదినాలు కల్పించటం లేదని, తక్కువ వేతనాలు వస్తున్నాయని, మూడు, నాలుగు వారాలు వేతనాలు పెండింగ్‌లో ఉంటున్నాయని కార్మికులు చెబుతున్నారు.
వేలికి గాయమై రూ.11 వేలు ఖర్చయింది
పని చేస్తుండగా పలుగు తగిలి బొటనవేలికి గాయమైంది. సెప్టిక్ అవడం తో వైద్యం చేయించుకుంటే రూ.11 వేలు ఖర్చయింది. మందు బిళ్ల ఇ చ్చి టింక్చర్ వేసి కట్టుకట్టిన వారు లేకపోవడంతోనే ఈ పరిస్థితి వ చ్చింది. అధికారులెవరూ పట్టించుకోలేదు. – పామర్తి శ్రీలక్ష్మి,పెడసనగల్లు
ఉపాధి కూలీలను ఆదుకోవాలి
కూలీలు పని చేస్తున్న ప్రదేశాల్లో కనీస సదుపాయా లు కల్పించాలి. 200 రోజుల పనిదినాలు కల్పించాలి. రోజువారీ వేతనాన్ని రూ.600లకు పెం చాలి. సకాలంలో వేతనాలు చెల్లించా లి. లేని పక్షంలో ఉపాధి కూలీల సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తాం.
– శీలం నారాయణరావు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు
Updated Date – Apr 25 , 2025 | 12:46 AM