ఓర్నీ ఇదా అసలు కథ.. హైబీపీకి ప్రధాన కారణాలు ఇవేనట.. ఇలా చేస్తే దెబ్బకు రివర్స్..

Written by RAJU

Published on:

ఓర్నీ ఇదా అసలు కథ.. హైబీపీకి ప్రధాన కారణాలు ఇవేనట.. ఇలా చేస్తే దెబ్బకు రివర్స్..

ఉరుకులు పరుగుల జీవితం.. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవనశైలి.. ఇవన్నీ ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికర రక్తపోటు (హైపర్‌టెన్షన్‌) తో బాధపడుతున్న రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. హై బీపీ సమస్యను తేలికగా తీసుకుంటే.. క్రమంగా అది ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గుండె సమస్యలు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.. అయితే.. ముఖ్యంగా చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. రక్తపోటు తరచుగా పెరగడం వల్ల మీ గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మీరు మీ గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటే, అధిక రక్తపోటుకు కారణమయ్యే కొన్ని సాధారణ కారణాల గురించి మీరు తెలుసుకోవాలి.. వీటిని నియంత్రించడం ద్వారా రక్తపోటు నుంచి బయటపడటంతోపాటు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు..

అధిక రక్తపోటుకు సాధారణ కారణాలు.. ఈ సమస్యను ఎలా అధిగమించాలి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

అధిక ఒత్తిడి..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక ఒత్తిడి తీసుకునే వ్యక్తులు అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటారు. ఇంకా, మద్యం సేవించడం లేదా ధూమపానం చేసే అలవాటు కూడా అధిక రక్తపోటు సమస్యకు దారితీస్తుంది.

బరువు పెరుగుట..

నిరంతర బరువు పెరగడం లేదా ఊబకాయం కూడా అధిక రక్తపోటుకు ప్రధాన కారణం కావచ్చు. అంతేకాకుండా, మీరు జంక్ ఫుడ్ లేదా వేయించిన ఆహారాలు ఎక్కువగా తింటే, మీ రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.

మీరు అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడాలనుకుంటే, మీరు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహార ప్రణాళికను అనుసరించడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా.. వ్యాయామం చేయకపోయినా.. అది అధిక రక్తపోటుకు కారణం కావచ్చు.

రక్తపోటును నియంత్రించే మార్గాలు..

మీరు మీ రక్తపోటును నియంత్రించుకోవాలనుకుంటే.. మొదట మీ ఒత్తిడిని నిర్వహించడం నేర్చుకోవాలి.

మీ గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి, మీరు మద్యపానం లేదా ధూమపాన వ్యసనానికి వీడ్కోలు చెప్పాలి.

అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి, మీరు మీ పెరుగుతున్న బరువును కూడా నియంత్రించుకోవాలి.

మంచి ఆహారం తీసుకోవడంతోపాటు.. అధిక రక్తపోటుకు గల కారణాలపై మీరు శ్రద్ధ వహిస్తే , మీ గుండె ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభమవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights