KKR vs LSG Match Report: ఐపీఎల్ 2025లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు సాగిన కేకేఆర్, లక్నో మ్యాచ్‌లో.. కోల్‌కతా నైట్ రైడర్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు వందల యాభైకి పైగా పరుగులు నమోదవ్వడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ల అద్భుతమైన ఇన్నింగ్స్ తో 238 పరుగుల భారీ స్కోరు చేసింది. సమాధానంగా, కేవలం 14 ఓవర్లలో 166 పరుగులు చేసి విజయం వైపు పయనిస్తున్నట్లు కనిపించిన కోల్‌కతా.. చివరి ఓవర్లలో ట్రాక్ తప్పింది. 20 ఓవర్లలో 234 పరుగులను మాత్రమే చేరుకోగలిగింది.
మంగళవారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. రింకు సింగ్ 15 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ అజింక్య రహానే 61, వెంకటేష్ అయ్యర్ 45 పరుగులు చేశారు. వారిద్దరూ 40 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యానికి తెరపడడంతో, కోల్‌కతా జట్టు మ్యాచ్ నుంచి దూరంగా వెళ్లింది. ఆకాశ్ దీప్, శార్దూల్ ఠాకూర్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 36 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 81 పరుగులతో అర్ధ సెంచరీ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ 47 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా 2 వికెట్లు పడగొట్టాడు. ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ పడగొట్టాడు.
రెండు జట్ల ప్లేయింగ్ 11..
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా.
ఇంపాక్ట్ ప్లేయర్: అంగ్క్రిష్ రఘువంశీ.
లక్నో సూపర్ జెయింట్స్: రిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, ఆకాశ్ దీప్.
ఇంపాక్ట్ ప్లేయర్: రవి బిష్ణోయ్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..