ఏసీ గదుల్లో కూర్చుంటే సమస్యలు తీరవు

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 02 , 2025 | 12:42 AM

ప్రభుత్వ అధికారులు ఏసీల్లో కూర్చుని విధులు నిర్వ హిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం కావని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధికారులకు చురకలు వేశారు.

ఏసీ గదుల్లో కూర్చుంటే సమస్యలు తీరవు

మండపేట, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారులు ఏసీల్లో కూర్చుని విధులు నిర్వ హిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం కావని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధికారులకు చురకలు వేశారు. గొల్లపుంతలో ఇళ్లను లబ్ధి దారులకు అప్పగించే వరకు టెంట్‌లో కూర్చుని పాలన సాగించాలని ఆయన కమిషనర్‌ రంగా రావును ఆదేశించారు. మండపేట 20వ వార్డులో వున్న టిడ్కో గృహాల సముదాయం వద్ద మంగళవారం ఎమ్మెల్యే టిడ్కో, మున్సిపల్‌ విద్యుత్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు టిడ్కో గృహాలను ఎంత మంది లబ్ధిదారులకు అప్పగించారని ప్రశ్నించారు? బ్యాంకు రుణాలు లబ్ధిదారులకు ఎంత మేరకు ఇచ్చారు అనే అంశాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అపార్ట్‌మెంట్‌ వద్ద సంబంధిత బ్లాక్‌ వివరం, అఽధికారి ఫోన్‌ నెంబరు ఏర్పాటు చేయాలని ఆయన అదేశిం చారు. టిడ్కో సముదాయంలో ఇళ్లను లబ్ధిదారులకు అందిం చటంతో పాటు సమస్యలు పరి ష్కారం అయ్యే వరకు పరిపా లన ఇక్కడ నుంచే సాగించాలని కమిషనర్‌ను అదేశించారు. లబ్ధి దారులు ఇక్కడికి రాకుంటే వారి ఇళ్లను రద్దు చేసి దాని జాబితా ను కలెక్టర్‌కు సమర్పించాలని వేగుళ్ల తెలిపారు. కాలనీలోని లబ్ధిదా రుల సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట కమిషనర్‌ రంగారావు, మున్సిపల్‌ ఏఈ పవన్‌, టిడ్కో ఏఈ వివేక్‌, మెప్మా సీఎంఎం పి.సుజాత, విద్యుత్‌ అధికా రులు పాల్గొన్నారు.

Updated Date – Apr 02 , 2025 | 12:42 AM

Google News

Subscribe for notification
Verified by MonsterInsights