ABN
, Publish Date – May 01 , 2025 | 12:05 AM
వేసవి ఎండతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోం ది. జిల్లాలో 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవుతోంది.

అత్యవసర విభాగం వార్డులో పేషెంట్లు
అత్యవసర విభాగంలో ఏసీలు మాయం
మరమ్మతులకు పంపి.. తిరిగి ఏర్పాటు చేయలేదు
వెంటిలేషన్.. కిటికీలు లేక పేషెంట్ల హాహాకారాలు
ఐసీయూ.. బర్న్స్ వార్డుల్లో మంటలే
పట్టించుకోని అధికారులు
ఏలూరు క్రైం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): వేసవి ఎండతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోం ది. జిల్లాలో 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోడ్డు, ఇతర ప్రమాదాల్లో బాధితు లు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఏలూ రు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఉక్కబోతతో అల్లాడుతున్నారు. ఆస్ప త్రి అత్యవసర చికిత్స విభాగంలో 3 ఏసీలను ఏర్పాటు చేశారు. మరమ్మతులకు గురికావడం తో వేసవిలో కూడా మూలనపడి ఉన్నాయి. ఏసీ రూములు కావడంతో వెంటిలేషన్, కిటికీలు లేవు.
ఐసీయూలో కొన్ని ఏసీలు మాత్రమే పని చేస్తున్నాయి. బర్న్స్ వార్డులో కూడా ఇదే పరిస్థి తి. అత్యవసర విభాగంలో ఏడాదిపైగా ఏసీలు పాడైనా పట్టించుకోలేదు. అవి కూడా పనిచేస్తు న్నాయని రికార్డుల్లో చూపించడం గమనార్హం. వేసవి ఎండలు ఉండడంతో ఆసుపత్రికి వచ్చిన వారు కనీసం అత్యవసర విభాగం చికిత్స రూమ్‌లో ఏసీలు ఉంటే కొంత ఉపశమనం పొందగలుగుతారు. అధికారులు తక్షణం ఏసీల ను ఏర్పాటుచేయాల్సి ఉంది.
Updated Date – May 01 , 2025 | 12:05 AM