ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే ఉమ్మడి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. బీజేపీ నేత, ఏపీ బీజేపీ క్షమశిక్షణ కమిటీ ఛైర్మన్ పాక వెంకటసత్యనారాయణ పేరును ఖరారు చేసింది ఆ పార్టీ అధి నాయకత్వం. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై కొంతకాలంగా సస్పెన్స్ నెలకొంది.
ఈ నేపథ్యంలో అభ్యర్థిని ప్రకటిస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం(ఏప్రిల్ 29) మధ్యాహ్నం 3గంటలకు ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి నామినేషన్ల గడువు ముగియనుండటంతో అభ్యర్థిగా పాక వెంకటసత్యనారాయణ పేరును ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. గతంలో రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గానూ వెంకట సత్యనారాయణ వ్యవహరించారు. 1996లో నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి వెంకటసత్యనారాయణ పోటీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..