RGUKT AP IIIT Admissions 2025 : ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 10వ తరగతి పాసైన విద్యార్థులు అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకెళ్తే..
హైలైట్:
- ఏపీ ట్రిపుల్‌ఐటీ అడ్మిషన్లు 2025-26
- నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్‌జీయూకేటీ
- ఏప్రిల్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
- మే 20 దరఖాస్తులకు చివరితేది

ఈసారి RGUKT AP అధికారులు వీలైనంత త్వరగా AP IIIT ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత వీలైనంత వేగంగా ప్రవేశాల ప్రక్రియ చేపట్టి జూన్ నెలలో తరగతులు ప్రారంభమయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్ వివరాలు, ఫలితాలు తదితర అన్నీ విషయాలను అధికారిక వెబ్‌సైట్ https://www.rgukt.in/ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇతర ముఖ్యమైన వివరాలు :
- నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు భర్తీ చేస్తారు.
- రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం సీట్లు కేటాయిస్తారు.
- మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతో పాటు తెలంగాణ విద్యార్థులు పోటీపడవచ్చు. ఈ సీట్లను తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తారు. (ఈ సమాచారాన్నిగత సంవత్సరం ఆధారంగా తెలియజేశాము. పూర్తి నోటిఫికేషన్ అందుబాటులోకి వచ్చాక స్పష్టత వస్తుంది)
విద్యార్హతలు:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. అయితే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. సర్కార్ బడుల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను యాడ్ చేసి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అయితే 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్ ఆధారంగా ట్రిపుల్ ఐటీల్లో సీట్లు భర్తీ చేస్తారన్న విషయం తెలిసిందే.
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: ఏప్రిల్ 23, 2025
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 27, 2025
- దరఖాస్తులకు చివరితేది: మే 202, 2025
- తరగతుల ప్రారంభం: జూన్ / జులై నెలలో ప్రారంభమవుతాయి.
10వ తరగతి మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ముగిశాక కౌన్సెలింగ్‌కు సంబంధించిన కాల్ లెటర్లను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ ఆర్జీయూకేటీ అప్లికేషన్ నెంబరు, పదోతరగతి హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేసి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో పేర్కొన్న తేదీలు, కౌన్సెలింగ్ వేదిక వివరాలు చూసుకుని ఆ తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.