ఏపీ గురుకుల 5వ తరగతి హాల్‌టికెట్ 2025,Gurukulam Information : ఏపీ గురుకుల 5వ తరగతి అడ్మిషన్లు.. APRS CAT 2025 Corridor Ticket అప్‌డేట్స్ – ap gurukulam fifth class entrance check 2025 aprs cat corridor ticket obtain hyperlink can be out at aprs apcfss in
AP Gurukulam 5th Class Admission 2025 : ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నారు. వివరాల్లోకెళ్తే..
Samayam Telugu ఏపీ గురుకుల 5వ తరగతి హాల్‌టికెట్ 2025AP Gurukulam 5th Class Entrance Test 2025 : ఆంధ్రప్రదేశ్ గురుకుల స్కూళ్లలో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఏప్రిల్ 17వ తేదీన విడుదల కానున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://aprs.apcfss.in/ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీని ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ముద్రించిన హాల్‌టికెట్లు లేదా పోస్ట్ / మెయిల్ ద్వారా పంపించరు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. హాల్ టికెట్ లేకుండా అభ్యర్థులు పరీక్షకు అనుమతించబడరు. అభ్యర్థులు హాలిటికెట్‌పై పేర్కొన్న సమయానికి, సూచించిన పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
5వ తరగతి ప్రవేశ పరీక్ష విధానం :
ఈ ప్రవేశ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. అయితే ప్రశ్నలు 4వ తరగతి స్థాయిలో ఉంటాయి. తెలుగు/ ఉర్దూ నుంచి 25 మార్కులకు 25 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ నుంచి 15 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి. గణితం నుంచి 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. అలాగే పరిసరాల విజ్ఞానం (ఈవీఎస్) నుంచి 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రవేశ పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది.
ఈ ప్రవేశ పరీక్ష 26 జిల్లా ప్రధాన కేంద్రాల్లో నిర్దేశించిన ఎగ్జామ్ సెంటర్లలో మాత్రమే నిర్వహిస్తారు. ఇక ఈ ప్రవేశ పరీక్ష కొశ్చన్ పేపర్ తెలుగు / ఇంగ్లిష్ మీడియంలో అలాగే ఉర్దూ / ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌ను బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో మాత్రమే బబుల్ చేయాలి. అలాగే.. ఓఎంఆర్ షీట్‌లో పేర్కొన్న సూచనలను తప్పనిసరిగా పాటించాలి.. లేకుంటే ఓఎంఆర్ షీట్‌ను రద్ద చేస్తారు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి