AP Inter Short Memo Download 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. ఫెయిలైన వారి కోసం సప్లిమెంటరీ పరీక్ష తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈక్రమంలో..

ఇంటర్ షాట్ మోమోలు.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ క్లిక్ చేయండి
- హోంపేజీలో కనిపిస్తున్న మోమో అప్షన్‌ను ఎంపిక చేసుకోండి
- మీ రోల్‌నెంబర్, కోర్సు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేయండి
- వివరాలు ఎంటర్ చేసి మోమో డౌన్‌లోడ్ అనే అప్షన్‌పై క్లిక్ చేయండి
- తర్వాతి స్క్రీన్‌లో మీకు మోమో డిస్‌ప్లే అవుతుంది
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలను పరిశీలిస్తే.. ఇంటర్ మొదటి సంవత్సరం 70 శాతం మంది ఉత్తీర్ణత నమోదు కాగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 73 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలు నిలిచాయి. విద్యార్థులు వాట్సాప్ మన మిత్ర ద్వారా లేదా https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
మే 12 నుంచి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలు:
అయితే.. ఇంటర్మీడియట్ ఫెయిలైన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్ష తేదీలను కూడా విడుదల చేశారు. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 28వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జూన్ 4వ తేదీన, పర్యావరణ విద్య జూన్ 6వ తేదీన నిర్వహించనున్నారు. ఇక ఫెయిలైన విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఫీజులు చెల్లించవచ్చు. ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది.