ఏపీ ఇంటర్‌ రిజల్ట్స్‌ 2025,Inter Outcomes Stay : ఏపీ ఇంటర్‌ రిజల్ట్స్‌ 2025.. మీ ఫోన్‌లో ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోవచ్చు – ap inter outcomes 2025 stay updates

Written by RAJU

Published on:

AP Inter Result 2025 Manabadi : ఏపీ ఇంటర్‌ ఫలితాలు 2025 విడుదలకు సమయం వచ్చేసింది. విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రిజల్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి రానున్నాయి.

Samayam Teluguఏపీ ఇంటర్‌ ఫలితాలు 2025
ఏపీ ఇంటర్‌ ఫలితాలు 2025

AP Inter Results 2025 Live Updates : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. శనివారం (ఏప్రిల్ 12వ తేదీన) ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్‌ రిజల్ట్‌, సెకండిర్‌ రిజల్ట్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

ఇంటర్‌ ఫలితాలు ఫోన్‌లో ఎలా చెక్‌ చేసుకోవాలంటే..
ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలను మీ మొబైల్‌ ఫోన్‌లో కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఎలాగంటే.. మీ మొబైల్‌ బ్రౌజర్‌లో ఈ కింద సూచించిన అధికారిక వెబ్‌సైట్‌లోను ఓపెన్‌ చేయాలి.

ఈ వెబ్‌సైట్‌లలో హోమ్‌ పేజీలో AP Inter Results 2025 లేదా IPE March 2025 Results లింక్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ ఎంటర్‌ చేయాలి. సబ్‌మిట్‌ లేదా గెట్‌ రిజల్ట్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు మీ రిజల్ట్స్‌ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఈసారి పీడీఎఫ్‌ రూపంలో మార్కులు!
ఈ ఏడాది ఇంటర్మీయట్ పరీక్షలు పూర్తయిన తరువాత నుంచి వీలైనంత వేగంగా ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. ఏప్రిల్‌ 6వ తేదీ నాటికే మూల్యాంకనం పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్‌ పూర్తి చేశారు. దీనికి ఐదారు రోజులు సమయం పట్టింది. ఈ సారి వాట్సప్‌లోనే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను PDF రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే విద్యార్థులకు షార్ట్‌ మెమోలుగానూ ఉపయోగపడనున్నాయి. గతంలో ముందుగా ఫలితాలు విడుదల చేసి.. ఆ తర్వాత షార్ట్‌ మెమోలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేవారు. అయితే ఈసారి వాట్సప్‌లో ఫలితాలు ఇస్తున్నందున పీడీఎఫ్‌ రూపంలో మార్కులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ప్రైవేటు కాలేజీలకు దీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఏప్రిల్‌ 1 నుంచే తరగతులు ప్రారంభించారు. ఈ తరగతులు ఏప్రిల్‌ 23 వరకు జరగనున్నాయి. అనంతరం ఏప్రిల్‌ 24 నుంచి కాలేజీలకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights