ఏపీలో పాలిటెక్నిక్‌ లెక్చరర్ల పోస్టులు.. అర్హులు వీరే..!

Written by RAJU

Published on:

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో(ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌) లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 21

సబ్జెక్టుల వారీగా ఖాళీలు

  • ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌ – 2

  • కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌-1

  • కెమికల్‌ ఇంజనీరింగ్‌-1

  • సివిల్‌ ఇంజనీరింగ్‌-5

  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌-1

  • ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌-4

  • ఇంగ్లీష్‌-3

  • మేథ్స్‌-1

  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌-2

  • మైనింగ్‌ ఇంజనీరింగ్‌-1

అర్హత: సంబంధిత బ్రాంచిలో ప్రథమ శ్రేణిలో బీఈ, బీటెక్‌, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌ హయ్యర్‌ గ్రేడ్‌, షార్ట్‌హ్యాండ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన దివ్యాంగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష మెరిట్‌, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌ 27 నుంచి మే 17 వరకు

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 16

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/(S(tyrb 5fcozjoxbeodknuknd0w))/Default.aspx

Subscribe for notification