ఏడాదైనా.. కుక్క మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న యజమాని.. చర్చిలో ఘనంగా సంవత్సరీకం! – Telugu Information | Prayers and a feast had been held in church in reminiscence of a useless canine in Bhadradri Kothagudem District

Written by RAJU

Published on:

మనుషుల కన్నా శునకాలకు విశ్వాసం ఎక్కువ ఉంటుంది అనే సామెత పురాణాల కాలం నుండి ఉంది. నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ప్రస్తుతం ఇంటిలో తప్పనిసరిగా వివిధ జాతుల కుక్కలను పెంచుకుంటున్నారు. వీటిని ఇంటిలో ఒక చిన్న పిల్లవాడిలా, కుటుంబసభ్యులుగా చూసుకుంటారు. కుక్కలకు బర్త్‌డేలు, శ్రీమంతలు జరుపుతూ విందు భోజనాలు సైతం ఏర్పాటు చేస్తుంటారు. అంతే కాకుండా వీటికి అనారోగ్యం పాలైతే ఎంతో ఖర్చుపెట్టి వైద్యం చేయిస్తుంటారు. ఒకవేళ వాటికి జరగరానిది జరిగితే, ఇంటిలోని కుటుంబ సభ్యులు మరణించినట్లు తల్లడిల్లిపోతుంటారు.

ఈ క్రమంలోనే ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక కుక్క అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. దీన్ని తట్టుకోలేని ఓ స్కూల్ టీచర్ దాని అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాడు. అంతేకాదు దాని జ్ఞాపకాలను మరిచిపోకుండా, చనిపోయి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా చర్చిలో జ్ఞాపకార్థం ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసిచ భోజనాలు పెట్టి తన కుక్కపై మమకారాన్ని చాటుకున్నాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన 55 సంవత్సరాల వయస్సు గల నోబెల్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కుక్కలంటే విపరీతమైన ప్రేమ. ఒకటి కాదు రెండు కాదు మూడు కుక్కలను పెంచుతున్నారు. వివాహం మీద ఇష్టం లేక తనకు తోడుగా గత 15 సంవత్సరాలుగా కుక్కలను పెంచుకుంటూ, అవే తన కుటుంబసభ్యులుగా వాటితోనే జీవనం సాగిస్తున్నారు. ఉదయం వాకింగ్ వాటితో చెయ్యడం, ఇతనితో పాటే శునకాలు సైతం మంచంపై నిద్రించడం, వాటి పుట్టినరోజులు ఘనంగా జరుపుతంటారు. కుక్కలకు పుట్టిన బిడ్డలకు పేర్లు పెట్టి ఎంతో అభిమానంగా చూసుకొంటున్నారు. కుక్కలకు నాన్న, అన్న, చెల్లి, వీటికి తాను తాతగా ఫిల్ అవుతూ ఉంటారు.

అయితే గత సంవత్సరం వాటిలో అక్షిత దేవి అనే కుక్క చనిపోయింది. దాన్ని తన సొంత మనవరాలి భావించే నోబెల్, దాని మరణంతో తల్లడిల్లిపోయాడు. ఈ నేపథ్యంలోనే క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. అంతే కాకుండా కుక్క చనిపోయి సంవత్సరం పూర్తైన సంబందర్భంగా దాని జ్ఞాపకార్థం చర్చి‌లో ప్రార్థనలు నిర్వహించి, తన అభిమానం, ప్రేమను చాటుకొన్నాడు. పలువురికి విందు భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. మనుష్యులను నమ్ముకోవడం కంటే మూగ జీవలను నమ్ముకోవటమే ఉత్తమం అని అంటున్నారు ఉపాద్యాయుడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification