ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన అంతంతే | The response to LRS is final.

Written by RAJU

Published on:

– 25 శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం

– ఈ నెలాఖరు వరకు గడువు

– ఇప్పటి వరకు 691 ప్లాట్ల క్రమబద్ధీకరణ

– ఏప్రిల్‌ నెలాఖరు వరకు గడువు పెంచాలి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

అనధికారిక లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ కార్యక్ర మానికి దరఖాస్తుదారుల నుంచి అంతంత మాత్రంగానే స్పందన వస్తున్నది. ఈ నెలాఖరు వరకు ప్లాట్లను క్రమబద్ధీకరించుకుంటే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తా మని ప్రకటించినా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అధికార యంత్రాంగం చేస్తున్న విస్తృత ప్రచారం వల్ల ఇప్పుడిప్పుడే దరఖాస్తుదారుల్లో అవగాహన కలు గుతున్నది. రాయితీ గడువు తేదీని ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగిస్తేనే ఖజానా నిండే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన 25,513 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 691 మంది మాత్రమే తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రుసుం చెల్లించారు. పట్ట ణాల్లో 585 మంది, గ్రామాల్లో 106 మంది రుసుం చెల్లించారు. పట్టణాలు, మండలాల్లో దరఖాస్తుదారులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నా కూడా అధికారులు ఊహించినంత మేరకు ముందుకు రావడం లేదు. జిల్లాలో వచ్చిన దరఖాస్తుల్లో పంచాయతీల్లో 5,735, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 7,078, మంథని మున్సిపాలిటీలో 895, పెద్దపల్లి మున్సిపాలిటీ లో 10,269, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో 1,536 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు 4,251 దరఖాస్తులకు సంబంధించిన ఓపెన్‌ ప్లాట్లు గల భూములు రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత జాబితాల్లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 16,910 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. ఇంకా 3,568 దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సి ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌పై అధికా రులు విస్తృత ప్రచారం చేస్తున్నా దరఖాస్తుదారులు త్వరగా ముందుకు రావడం లేదు. మరోవైపు.. ఎల్‌ఆర్‌ఎస్‌ చేయకుండా విక్రయించే ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపి వేశారు. తద్వారా కొంత మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం కొంత మంది ముందుకు వస్తున్నారు.

ఫ ఎల్‌ఆర్‌ఎస్‌పై విస్తృత ప్రచారం..

రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండుకోవడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని భావిం చిన ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుంలో 25 శాతం రాయితీ ప్రకటించింది. అంతేగాకుండా కొత్తగా కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 2020, ఆగస్టు 26 లోపు సేల్‌ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసిన లే అవుట్‌ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించినట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని వేగిర పెట్టినా కూడా ఎవరు కూడా రుసుం చెల్లించేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం 25 శాతం రాయి తీ కల్పించి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. అవగా హన సమావేశాలు నిర్వహించడంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పట్టణాల్లో మైకుల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు ముద్రించారు.

ఫ ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంటేనే అనుమతులు

ప్లాట్లను క్రమబద్ధీకరించుకుంటేనే భవన నిర్మాణాలకు సులువుగా అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌ విలువను తాజా మార్కెట్‌ ధర కంటే డాక్యుమెంట్‌ విలువ ఆధారంగా అంచనా వేస్తా రని, తద్వారా యజమానులకు ప్రయోజనం కలగ నున్నదని చెబుతున్నారు. బ్యాంకు లోన్‌ ప్రాసెసింగ్‌ సమయంలో ప్రయోజనాలకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుంటే భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు 33 శాతం జరిమానా చెల్లించాల్సి వస్తుందని, తమ ప్లాటును ఇతరులకు విక్రయించేటప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంటే సులభంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరిగినప్పుడు 14 శాతం ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు కూడా పెరుగుతాయని, ఇప్పుడే ఎల్‌ఆర్‌ఎస్‌ చేయడం వల్ల భారీ మొత్తంలో డబ్బు ఆదా అవుతుందని, ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగులు పొందితే తమ ప్లాటుకు చట్టబద్ధంగా అధికారం పొందినట్లేనని అధికారులు ప్రచారం చేస్తున్నారు. దీంతో కొంత మేరకు దరఖాస్తుదారుల్లో ఆలోచనలు ఇప్పుడిప్పుడే మొదలవు తున్నాయి. గడువు తేదీ సమీపిస్తుండడంతో పలువురు మున్సిపల్‌, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్దకు వెళ్లి రుసుం ఎంత అవుతుందని ఆరా తీస్తున్నారు. 25 శాతం రాయితీ పొందేందుకు మార్చి నెలాఖరు వరకు ఇచ్చిన గడువు ఏమాత్రం సరిపోదని, దీనిని ఏప్రిల్‌ నెలాఖరు వరకు పెంచాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date – Mar 15 , 2025 | 01:35 AM

Subscribe for notification