(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఇరవై ఐదు శాతం రాయితీ ప్రకటించినా ప్రభుత్వం ఆశించిన మేరకు తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు రాకపోవడంతో ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పెంచింది. బుధవారం నాటికి జిల్లాలో 4,892 మంది తమ ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించారు. తద్వారా ప్రభుత్వానికి 17 కోట్ల 45 లక్షల 25 వేల రూపాయల ఆదాయం సమకూరింది. ఇతర జిల్లాలతో పోలిస్తే పెద్దపల్లి జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ శాతం పెరిగింది. అనఽధికారిక లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను మార్చి నెలాఖరు వరకు క్రమబద్ధీకరించుకుంటే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆశించిన మేరకు దరఖా స్తుదారుల నుంచి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం రాయితీ గడువును ఈ నెలాఖరు వరకు గడువు పెంచడంతో మరికొంత మంది ముందుకు వచ్చే అవకాశా లున్నాయి. సాంకేతిక సమస్యల వల్ల కొంత మంది ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించలేక పోయా రు. స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అధికార యంత్రాంగం చేస్తున్న విస్తృత ప్రచారం వల్ల ఇప్పుడిప్పుడే దరఖాస్తుదారుల్లో అవగాహన కలుగుతున్నది. రాయితీ గడువు తేదీని ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగిస్తేనే ఖజానా నిండే అవకాశాలు న్నాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన 25,514 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 4,892 మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రుసుం చెల్లించారు. 17 కోట్ల 45 లక్షల 25 వేల రూపాయల రుసుం చెల్లించారు. జిల్లాలో వచ్చిన దరఖాస్తుల్లో పంచాయతీల్లో 5,731 దరఖాస్తులు రాగా, 4,893 దరఖాస్తులకు అధికారులు ఆమో దం తెలపగా, 1,068 మంది 38 లక్షల 25 వేల రూపాయల ఫీజు చెల్లించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో 7,083 దరఖాస్తులకు, 4,187 దరఖాస్తులను ఆమోదించగా, 3,239 మంది 6 కోట్ల 9 లక్షల రూపాయల రుసుం చెల్లించారు. మంథని మున్సిపాలిటీలో 895 దరఖాస్తులను 732 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. 214 మంది 65 లక్షల రూపాయల రుసుం చెల్లించారు. పెద్దపల్లి మున్సి పాలిటీలో 10,278 దరఖాస్తులకు, 7,745 ఆమోదం తెలిపారు. 2466 మంది 9 కోట్ల 48 లక్షల రూపాయల రుసుం చెల్లించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 1,537 దరఖాస్తులకు 1,156 ఆమోదం తెలిపారు. 196 మంది 85 లక్షల రూపాయల రుసుం చెల్లించారు.
ఫ విస్తృత ప్రచారం
రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపడం కోసం ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ రుసుంలో 25 శాతం రాయితీ ప్రకటించి విస్తృత ప్రచారం చేయడంతో జిల్లాలో ఆమోదించిన దరఖాస్తుల్లో 26 శాతం మంది దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ రుసుం చెల్లించారు. 2020, ఆగస్టు 26లోపు సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లే అవుట్ యజమా నులు, ప్లాటు ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించినట్లు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని చూసినా ఎవరు కూడా రుసుం చెల్లించేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించి విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రస్తుతం మరో నెల రోజుల పాటు గడువు పెంచడంతో జిల్లా అదికార యంత్రాంగం ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు పెంపు, దాని ప్రయోజనాల గురించి మరింత అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది.