ఈరోజుల్లో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. దీనికి ముఖ్యకారణం జీవనశైలి. ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి లోను అవడం అనేది చాలా కామన్. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే మన మనసుకు కూడా తప్పకుండా కాస్త విశ్రాంతి ఇవ్వాలంట. లేకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు నిపుణులు.
ఉదయం లేవగానే చాలా పాజిటివ్‌గా నిద్ర నుంచి మేల్కొని, ప్రతి పనిని పూర్తి చేసుకోవాలంట. అస్సలే లేచిన వెంటనే ఫోన్ చూడటం చేయకూడదంట. నిద్ర లేచి నీరు తాగడం వలన మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుందంట.
మొబైల్ ఫోన్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదంట. ఎక్కువగా స్నేహితులతో గడపడానికి లేదా, పుస్తకాలు చదవడానికి లేదా కాసేపు పచ్చని చెట్ల మధ్య గడపడం వలన ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.
మనసును ప్రశాంతంగా ఉంచడానికి తప్పకుండా రోజులో కొద్ది సేపు ధ్యానం చేయాలంట. దీని వలన మానసిక ప్రశాంతత పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
వర్క్ చేసే విషయంలో కూడా అస్సలే ఒత్తిడి తీసుకోకూడదంట. ఎక్కువ స్ట్రెస్ లేని జాబ్ చేయడం వలన కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది.