ఎరుపు లేదా నలుపు.. వేసవిలో ఎలాంటి కుండ వాడితే మంచిదో తెలుసా..?

Written by RAJU

Published on:

ఎరుపు లేదా నలుపు.. వేసవిలో ఎలాంటి కుండ వాడితే మంచిదో తెలుసా..?

ఎండాకాలం మొదలైంది.. ఈ యేడు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే, ఫిబ్రవరి నెలాఖరు నుంచే సూర్యుడు ప్రతాపం మొదలుపెట్టాడు. మండిపోతున్న ఎండలకు శరీరంలోని నీళ్లు ఆవిరై చాలా మంది డీహైడ్రేషన్‌ బారినపడుతున్నారు. ఎండలో దాహంతో ఉన్నవారికి చల్లచల్లని నీళ్లు తాగనిదే ఉపశమనం లభించదు..అయితే, ఫ్రిజ్‌ నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరదు.. ఫ్రిజ్‌ వాటర్‌ తాగితే జలుబు చేస్తుంది. అందుకని కొందరు కేవలం మట్టి కుండను మాత్రమే వాడుతుంటారు. ఈ మట్టి కుండలలో నీళ్లు తాగడం వలన బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మట్టి కుండలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఎరుపు, నలుపు రంగుల్లో మట్టి కుండలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది మంచిదో ఎప్పుడైనా తెలుసుకున్నారా..?

చాలా మంది ప్రజలు ఎర్ర మట్టి కుండను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది టెర్రకోట బంకమట్టితో తయారు చేస్తారు. దీని అడుగు చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. దీంతో గాలి నెమ్మదిగా లోపలికి వెళ్లి నీటిని చల్లబరుస్తాయి. నల్ల కుండను నల్ల మట్టి, పొగతో కాల్చటం ద్వారా తయారు చేస్తారు. దీని నిర్మాణం నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. దీనిని కార్బోనైజ్డ్ క్లే పాట్ అని కూడా అంటారు. నల్ల కుండ ఉపరితలంపై ఆల్గే, బ్యాక్టీరియా త్వరగా పెరగవు. కాబట్టి నీరు ఎక్కువ సమయం పాటు తాజాగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఖనిజాలు లభిస్తాయి. దీనిని అమృత్ జల్ అంటారు.

మీకు త్వరగా చల్లటి నీరు అవసరమైతే ఎర్రమట్టితో చేసిన కుండ ఉత్తమం. కానీ మీరు నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచాలనుకుంటే నల్లటి కుండ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య దృక్కోణం నుండి, ఆయుర్వేదం ప్రకారం నల్ల కుండ నీరు మరింత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇందులో ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights