ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఇలా చేయండి..

Written by RAJU

Published on:

హార్మోన్స్ ప్రభావంతో పని చేసే తోలు బొమ్మలం కాబట్టి.. మనకు ఎమోషన్స్ అన్నవి సహజం. నెగిటివ్ కావచ్చు.. పాజిటివ్ కావచ్చు.. సంతోషం కావచ్చు.. బాధ కావచ్చు.. ఏదైనా ఒక కంట్రోల్‌లో ఉండాలి. అలా కాకపోతే.. మనం కంట్రోల్ చేయాల్సిన ఎమోషన్స్ కంట్రోల్‌లోకి మనం వెళ్లిపోవాల్సి వస్తుంది. కంట్రోల్ మొత్తం ఎమోషన్స్ చేతిలోకి వెళ్లిపోతే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎమోషనల్‌గా బలహీనంగా ఉండేవాళ్లు అందరికీ లోకువ అయిపోతారు. ఎదుటి వాళ్లకు మన బలహీనత ఓ అస్త్రంలా మారిపోతుంది. వాళ్ల అవసరాల కోసం మనల్ని తోలు బొమ్మల్లా ఆడిస్తారు. ముఖ్యంగా మనల్ని బాధ పెట్టే విషయాల్లో. మనం మన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేయటం కష్టమే కానీ, అసాధ్యం అయితే కాదు. గట్టిగా ప్రయత్నిస్తే ఎమోషన్స్‌ను మనం కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు. మనకు మనమే బాస్‌ అవ్వొచ్చు..

మీ ఎమోషన్స్‌ను అర్థం చేసుకోండి

మీ ఎమోషన్స్‌ను మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఏ విషయంలో ఎమోషనల్‌గా వీక్ అవుతున్నారు. ఏ విషయం మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుందో తెలుసుకోండి. ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా వాటిపై ఓ అవగాహనకు రండి.

ట్రిగ్గర్స్‌ను కనుక్కోండి

ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఎమోషనల్‌గా ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ఆలోచనల వల్ల ఇబ్బందిపడుతున్నారో గుర్తించండి.

ఎమోషనల్ ఇంటెలిజెన్స్

ఎమోషన్స్‌ను ఒకేసారి కంట్రోల్ చేయటం కుదరదు. మనం మన ఎమోషన్స్‌ను అర్థం చేసుకుని.. వాటిని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలో మెల్లమెల్లగా నేర్చుకోవాలి. కేవలం మన ఎమోషన్స్‌ను మాత్రమే కాదు.. ఇతర ఎమోషన్స్‌ను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

గట్టిగా గాలి పీల్చి వదలండి

ఎమోషన్స్ మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నపుడు గుండెల నిండా గట్టిగా గాలి పీల్చి వదలటం ఎంతో మేలు చేస్తుంది. ఇలా చేయటం ద్వారా ఎమోషన్స్ తీవ్రత తగ్గుతుంది. ఎలా పడితే అలా కాకుండా పద్దతి ప్రకారం ఈ ఎక్సర్‌సైజ్ చేయాలి. మొదటగా గట్టిగా గాలి పీల్చాలి. కొద్దిసేపు అలాగే ఉండాలి. మూడు వరకు లెక్కబెట్టాలి. ఆ తర్వాత గాలిని మెల్లగా బయటకు వదలండి. మనసులో ‘ నేను రిలాక్స్ అవుతున్నాను.. ’ అని అనుకోండి.

సరైన టైం

మీ ప్రియురాలు మిమ్మల్ని కాదంది అనుకుందాం.. మిమ్మల్ని దూరం పెట్టింది అనుకుందాం.. ఇలాంటి టైంలో ఎవ్వరికైనా బాధ కలుగుతుంది. అప్పటి వరకు మనతో ఉన్న వారు పక్కన లేకపోతే.. మనల్ని దూరం పెడుతుంటే ఏడుపు వస్తుంది. ఇలాంటి టైంలో కొందరు పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ఉంటారు. వాళ్లను మళ్లీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. గొడవ పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే సరైన టైం కోసం వేచి చూడాలి. అవతలి వాళ్లతో కూర్చుని మాట్లాడగలిగే సమయం రావాలి. మన ఫీలింగ్స్‌ను వాళ్లు అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. అప్పుడు మనం ఏం చెప్పాలో చెబితే.. లాభం ఉంటుంది. అంతవరకు మీ కోసం మీరు బతకండి.. మీ కంటూ కొంత సమయాన్ని కేటాయించుకోండి. బాధలోనూ సంతోషాన్ని వెతుక్కోండి.

ఇవి కూడా చదవండి:

Egg: కోడిగుడ్డు.. వెజ్జా.. నాన్ వెజ్జా.. నిపుణులేం చెబుతున్నారు

Viral Video: ఎక్కడ, ఎలా ఆపాలో కూడా తెలియాలి.. అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Viral Video: గేటు మధ్యలో ఇరుక్కుపోయిన కారు.. దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్..

Subscribe for notification