ఒడిశాలోని ఖోర్దా జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన అందరినీ కలచివేసింది. అతను ఆత్మహత్యకు గల కారణం తన భార్యేనని చెబుతూ ఒక వీడియోని కూడా విడుదల చేశాడు. దాంతో ఈ వార్త దావానంలా వ్యాపించింది. విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకునేలా చేసింది. ఈ ఘటన జిల్లాలోని కుమ్భార్‌బస్తా గ్రామానికి చెందిన రామచంద్ర బర్జెనా విడుదల చేసిన ఆ వీడియోలో తన భార్య వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. భార్య రూపాలి మానసిక వేధింపులు భరించలేక వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..రామచంద్రతో రూపాలి వివాహం జరిగింది. వీరి పెళ్లి కోసం రూ.20 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడని రామచంద్ర తల్లిదండ్రులు పోలీలసుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కోడలు పదేపదే తన తల్లిదండ్రులకు ఇంటికి వెళ్లేదని, అడ్డు చెబితే తిట్టేదని రామచంద్ర తల్లి ఆరోపించింది. పెళ్లికి అయ్యే మొత్తం ఖర్చుని కూడా తమ కుటుంబమే భరించిందని, భార్య వేధింపులు తాళలేకే తన కొడుకు చనిపోయాడని రామచంద్ర తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. రూపాలిని అరెస్ట్ చేశారు. వీరికి ఒక కూమార్తె కూడా ఉందని తెలిసింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..