
అయితే, ఎడాపెడా శీతలపానీయాలను తాగడంవలన తాత్కాలికంగా ఉపశమనం లభించినా ఆరోగ్యానికి మాత్రం ఇది అస్సలు మంచిదికాదని తాజా అధ్యయనం వెల్లడించింది. కూల్‌డ్రింక్స్‌లో అధికంగా సుక్రోజ్ ఉంటుందని, ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుందని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లోని అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ యూనిట్ ఆన్ మెటబాలిజం, డెవలప్‌మెంట్ అండ్ ఏజింగ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సుక్రోజ్ కారణంగా మనం తీసుకొనే ఆహార పదార్థాల్లోని అమైనో ఆమ్లాలు, కొవ్వు కంటే ఎక్కువగా శరీరంలో అసమతుల్యంగా మారిన గ్లూకోజ్ శోషణ జరుగుతుందని, దీనివల్ల చిన్న పేగుల మీద అత్యంత వేగంగా దుష్ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. ఇది శరీరంలోని కండరాలు పెంచేందుకు దోహదపడే నిర్మాణాత్మక జీవక్రియ, కొవ్వు, గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే విచ్ఛిన్నాత్మక జీవక్రియను దెబ్బతీస్తాయని అందుకు కారణం.. కూల్‌డ్రింక్స్‌లో అధిక మోతాదులో ఉండే సుక్రోజ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వర్షంలో తడుస్తున్న పిల్లిపిల్లకు.. కుక్కపిల్ల సాయం..
బీపీని కంట్రోల్‌లో పెట్టే ఫుడ్స్ ఇవే! వెంటనే తినడం మొదలుపెట్టండి
భార్య రీల్స్ సరదా.. పాపం భర్త ఉద్యోగానికి ఎసరు
పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం..
ఒక టీ 65 వేలు, నీళ్ల బాటిల్ 50 వేలు.. ఆ రెస్టారెంట్ బిల్లుతో పట్టపగలే చుక్కలు