ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు రాలడం తగ్గి.. ఒత్తుగా పెరుగుతుంది.. చుండ్రుకు చక్కని పరిష్కారం..

Written by RAJU

Published on:

ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు రాలడం తగ్గి.. ఒత్తుగా పెరుగుతుంది.. చుండ్రుకు చక్కని పరిష్కారం..

ఈ బిజీ జీవితంలో మొత్తం జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారిపోయాయి. అధిక పని ఒత్తిడి కారణంగా, జుట్టు సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి ఒక ముఖ్యమైన సమస్య జుట్టు రాలడం. నేడు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం సమస్య నుండి బయటపడటానికి ఖరీదైన షాంపూలు, నూనెలు, అనేక జుట్టు ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ వాటిలో ఉండే రసాయనాలు కూడా హానికరం కావచ్చు. అటువంటి పరిస్థితిలో ఉల్లిపాయ రసం మరింత ప్రయోజనకరంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఒత్తైన, పొడవైన జుట్టు కావాలని కోరుకునే వారు ఉల్లిపాయ రసంలో ఈ మూడు పదార్థాలు కలిపి రాసుకోవడం వల్ల ఊహించని ఫలితాలను చూస్తారు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది

మెంతులు: జుట్టు రాలడం వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్టయితే, మీరు ఉల్లిపాయ రసంలో మెంతి గింజలను కలిపి పేస్ట్ లా అప్లై చేసుకోవచ్చు.. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టును బలంగా, పొడవుగా, మందంగా చేస్తుంది. ఇందుకోసం ఒక చెంచా మెంతులు తీసుకుని రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఉదయం, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి.. ఇప్పుడు ఈ పేస్ట్ కు 2-3 చెంచాల ఉల్లిపాయ రసం కలిపి తలకు అప్లై చేయండి. దాదాపు 1 గంట తర్వాత తేలికపాటి షాంపూతో వాష్‌ చేసుకోవలి. ఇలా మీరు వారానికి కనీసం రెండుసార్లు ఉపయోగిస్తే అద్భుతమైన మార్పును చూస్తారు.

కొబ్బరి నూనె: మీరు జుట్టు రాలడం సమస్యతో ఇబ్బంది పడుతుంటే కొబ్బరి నూనెను ఉల్లిపాయ రసంతో కలిపి రాయండి. ఇందుకోసం 3 టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని 2 టీస్పూన్ల కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు బాగా అప్లై చేయండి. చేతులతో కాసేపు తేలికగా మసాజ్ చేసి, ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. మీరు మెరుగైన ఫలితాలను పొందాలనుకుంటే, వారానికి కనీసం రెండు నుండి మూడు సార్లు ఉపయోగించండి.

కరివేపాకు: ఆహార రుచిని పెంచే కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి కూడా గొప్ప మేలు చేస్తుంది. ఉల్లిపాయ రసం, కరివేపాకు కలిపి వాడితే జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గడానికి, 10-12 కరివేపాకులను బాగా నలిపి పేస్ట్ లా చేసి, దానికి 2 టీస్పూన్ల ఉల్లిపాయ రసం కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మీద బాగా అప్లై చేయండి. అరగంట తర్వాత జుట్టును తేలికపాటి షాంపూతో బాగా కడగాలి వారానికి కనీసం రెండుసార్లు ఇలా ట్రై చేసి చూడండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights