భారత దేశంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. IMF, ప్రపంచ బ్యాంకు, ILO వంటి ప్రముఖ సంస్థలు ఇప్పుడు మహిళల ఆర్థిక భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. మహిళను ఆర్థికంగా బలోపేత చేస్తే.. ఇది ఉత్పాదకతను పెంచుతుంది, పేదరికాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ఎలా ఇండియాలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.. మహిళల పాత్ర ఎక్కువగా ఉంటే సూక్ష్మ, నానో సంస్థలకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వడం ద్వారా దేశాభివృద్ధిలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది.
రుణ పరిమితులు, ముఖ్యంగా మహిళలకు, ఉత్పాదకతను పెంచే కార్యకలాపాలలో సబ్-ఆప్టిమల్ పెట్టుబడికి దారితీస్తాయనే సిద్ధాంతాన్ని ఇది అమలు చేస్తుంది. గతంలో, భారతదేశంలో మహిళలు సంస్థాగత, సాంస్కృతిక, సమాచార అసమానతల కారణంగా రుణాలు పొందడంలో అడ్డంకులను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా.. చిన్న మొత్తంలో రుణాలు అనేవి పెట్టుబడిని నిరోధిస్తాయి, నియామక సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి, తద్వారా మహిళల నేతృత్వంలోని సంస్థల దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని కుంగదీస్తాయి. అయితే ముద్ర యోజన పథకం ఈ అడ్డంకులను నేరుగా పరిష్కరిస్తుంది.
ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజన ఎలా ఉపయోగపడుతోంది? అలాగే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, మైక్రోఫైనాన్స్ మధ్యవర్తుల ద్వారా క్రెడిట్ యాక్సెస్‌ను వికేంద్రీకరిస్తుంది. దీని ద్వారా అధికారిక క్రెడిట్‌ను అందుబాటులోకి తెస్తుంది. గతంలో జీతం లేని ఇంటి పనికి, వేతన పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఈ ముద్ర లోన్స్ కారణంగా టైలరింగ్ యూనిట్లు, బ్యూటీ పార్లర్లు, ఫుడ్ స్టాల్స్, అగ్రి-ప్రాసెసింగ్ వెంచర్లు, రిటైల్ దుకాణాలు వంటి సూక్ష్మ సంస్థలను ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు వారి వంతు సహకారం అందిస్తున్నారు. అయితే ఈ మార్పు కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, ఇది చాలా సామాజికమైనది. ఇది ఇంట్లో మహిళల గౌరవం కూడా పెంచుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.