ఉన్మాదం.. 16ఏళ్ల బాలిక పాదాలకు మేకులు కొట్టి.. పైశాచికం..!

Written by RAJU

Published on:


ఉన్మాదం.. 16ఏళ్ల బాలిక పాదాలకు మేకులు కొట్టి.. పైశాచికం..!

బీహార్‌లో ఒళ్లు గగుర్పాటు గురి చేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ముజఫర్‌పూర్ జిల్లాలోని గయాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 16 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా పాశవికంగా హతమార్చారు. హంతకుడు ఆ అమ్మాయి రెండు కాళ్ళలోకి ఇనుప మేకులు కొట్టాడు. అలాగే, ఆమె శరీరంపై ఉప్పు చల్లి మట్టిలో పాతిపెట్టారు. ఆ యువతి శరీరంపై అనేక చోట్ల గాయాల గుర్తులు కనిపించాయి. దర్యాప్తులో భాగంగా చివరికి మహురా గ్రామంలోని సియారి నది ఒడ్డున మట్టి కింద పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు.

గైఘాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మహురా గ్రామంలోని సియారి నది సమీపంలోని గొయ్యిలో పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. ఆ టీనేజర్ మృతదేహం ఆమె ఇంటి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. రహస్య సమాచారం ఆధారంగా, పోలీసులు గాలింపు తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భూ వివాదం కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి దగ్గర బంధువుపై హత్య ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత అందరూ తమ ఇళ్లను వదిలి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతురాలిని పిరౌచా నివాసి అయిన రామ్ బాబు రామ్ కుమార్తె రీమా కుమారిగా గుర్తించారు. మృతదేహం దొరికినట్లు సమాచారం అందడంతో, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. FSL బృందం సంఘటన స్థలం నుండి నమూనాలను సేకరించింది. ఇంట్లో తల్లి, కూతురు మాత్రమే నివసిస్తున్నారు. కొడుకు ఢిల్లీలో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజులుగా కూతురు కనిపించకుండా పోయిన తర్వాత, కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికారు. కానీ ఆమె గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. దీని తర్వాత, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రెండు రోజులుగా ఆ అమ్మాయి కనిపించడం లేదని మృతురాలి తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ అభిషేక్ కుమార్ తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, సియారి నది దగ్గర ఒక మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ అమ్మాయి రెండు కాళ్లలో పెద్ద ఇనుప మేకులు దిగగొట్టిన తర్వాత ఆమె శరీరం మూడు అడుగుల లోతున మట్టిలో పాతిపెట్టారు. యువతి శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయి. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights