ఉల్లిపాయ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిలో లభించే మూలకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఉల్లిపాయతో చేసిన టీ ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి ఫ్లెవనాల్ అనే పోషకం పుష్కలంగా లభించి.. రక్తపోటును నియంత్రిస్తుంది.
ముఖ్యంగా ఉల్లిపాయ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఆనియన్ టీని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.. దీనికి కావాల్సిందల్లా కొన్ని మసాలా దినుసులు, ఉల్లిపాయలు.
ఉల్లిపాయ టీ నిద్రలేమి, అధిక రక్తపోటు, క్యాన్సర్, చక్కెర స్థాయి, రక్తహీనత, కడుపు సంబంధిత వ్యాధి, బరువును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. మీరు వ్యాధులను దూరంగా ఉంచుకోవాలనుకుంటే ఈరోజు నుండే ఉల్లిపాయ టీని క్రమం తప్పకుండా తాగడం అలవాటు చేసుకోండి.
ఉల్లిపాయ టీ తాగడం మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ మీరు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే దాని ప్రయోజనాలను మీరు స్పష్టంగా చూస్తారు. ఉల్లిపాయ టీ క్యాన్సర్లో సహాయపడుతుంది. మధుమేహం నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తపోటు నివారణగా పనిచేస్తుంది.
ముందుగా ఈ ఉల్లిపాయ టీని తయారు చేసుకోవడానికి ఓ పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో రెండు గ్లాసుల నీటిని పోసుకొని మసాలా దినుసులు అన్ని వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఉడకబెట్టుకోండి. ఇలా అన్నీ ఉడకబెట్టిన తర్వాత ఒక గాజు గ్లాసులోకి టీని సర్వ్ చేసుకుని, అందులో కావలసినంత తేనెను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే.. అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.