ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీకు డయాబెటిస్ వచ్చినట్లే..

Written by RAJU

Published on:

ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీకు డయాబెటిస్ వచ్చినట్లే..

భారతదేశంలో ప్రతి సంవత్సరం డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు.. అయితే.. దేశంలో 10 కోట్లకు పైగా డయాబెటిస్ బాధితులు ఉన్నారని.. పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. అయితే.. డయాబెటిస్ విషయంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే దాని లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తించబడతాయి. మధుమేహం (డయాబెటిస్) అనేది రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు అధికంగా ఉండటం వల్ల వచ్చే ఒక వ్యాధి. మధుమేహం ఒకసారి వస్తే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.. కేవలం నియంత్రణలో మాత్రమే ఉంచుకోగలం.. కాబట్టి, రోగి జీవితాంతం దానితో పోరాడాల్సి ఉంటుంది.. అయితే మధుమేహం ఎప్పుడూ అకస్మాత్తుగా సంభవించదు. దీని లక్షణాలు చాలా కాలం నుంచి కనిపించడం ప్రారంభిస్తాయి.. కానీ ప్రజలు వాటిని తరచూ విస్మరింస్తుంటారు.. అటువంటి పరిస్థితిలో, ఉదయం నిద్రలేచిన తర్వాత ఖచ్చితంగా కనిపించే కొన్ని లక్షణాలను మేము మీకు చెప్పబోతున్నాము. ఇవి.. కనిపిస్తే మధుమేహం వచ్చినట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అజిత్ జైన్ మాట్లాడుతూ.. కొన్ని లక్షణాలను విస్మరించకూడదని అంటున్నారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా అలసిపోయినట్లు అనిపిస్తే.. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తే.. గొంతు ఎండిపోతుంటే.. లేదా ఆకలి అకస్మాత్తుగా పెరిగితే లేదా తగ్గితే, ఇవన్నీ డయాబెటిస్ లక్షణాలు కావచ్చు.. అని పేర్కొన్నారు. వీటిని నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ చక్కెర స్థాయిని తనిఖీ చేసుకోవాలి. మీరు ఇంట్లో లేదా ల్యాబ్‌కు వెళ్లి మీ పరీక్షను చేసుకోవచ్చు.. దీని ప్రకారం వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి..

డయాబెటిస్ ఎందుకు పెరుగుతోంది?

టైప్-1 డయాబెటిస్ జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది.. టైప్-2 డయాబెటిస్ సరైన ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి వల్ల వస్తుందని డాక్టర్ జైన్ చెబుతున్నారు. గతంలో, 50 సంవత్సరాల తర్వాత టైప్-2 డయాబెటిస్ వచ్చేది.. కానీ ఇప్పుడు ఈ వ్యాధి చిన్న వయస్సులోనే, అంటే 25 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సులో కూడా వస్తుంది. దీనికి ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి.

ప్రజల ఆహారంలో ఫ్రైలు, జంక్ ఫుడ్ పెరుగుతోంది. మద్యం సేవించే అలవాటు పెరుగుతోంది. నిద్రపోయే – మేల్కొనే విధానం క్షీణిస్తోంది. ఈ కారణంగానే ప్రజలు టైప్-2 డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు.

ఇప్పుడు దేశంలో డయాబెటిస్ అనే వ్యాధి ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి చికిత్స కోసం కొత్త మందులు కూడా వస్తున్నాయి. మధుమేహం కారణంగా, ప్రజలు అనేక ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మధుమేహాన్ని ఎలా నివారించాలి

ప్రజలు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. ప్రతిరోజు 1 గంటపాటు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయాలి..

మీ ఆహారంలో చక్కెర, పిండి, ఉప్పు మొత్తాన్ని తగ్గించండి.

మానసిక ఒత్తిడికి గురికావద్దు

ప్రతిరోజూ సమయానికి పడుకోండి.. కనీసం 8 గంటలు నిద్రపోండి. ఉదయాన్నే మేల్కోండి..

ఫ్రైలు, సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్లు లాంటి వాటికి దూరంగా ఉండండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification