పహల్గాం దాడిని ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన
కనిగిరి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : పహల్గాంలో ఉగ్ర దాడిని ఖండిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారంరాత్రి కనిగిరిలో కొవ్వొత్తులతో పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక చర్చి సెంటరులో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదం నుంచి కేంద్ర ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. దేశంలో నివసించే కొంతమంది ఉగ్రవాద అనుయాయులు హిందువుల ప్రాణాల్ని బలిగొంటున్నారని ఆరోపించారు. హిందువులంతా ఒకే తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లేదంటే భారతదేశంలో ఒకప్పుడు హిందువులు ఉండేవారనే రోజు వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.