ఉగ్రభయం..! రైల్వే ట్రాక్ బోల్ట్‌లు తొలగించిన దుండగులు.. ఏం జరిగిందంటే..

Written by RAJU

Published on:


ఉగ్రభయం..! రైల్వే ట్రాక్ బోల్ట్‌లు తొలగించిన దుండగులు.. ఏం జరిగిందంటే..

పహల్గాం ఉగ్రదాడిలో నేపథ్యంలో యావత్‌ దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ కొనసాగుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో చెన్నై లోని అరకోణం లో జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్వే ట్రాక్ బోల్ట్‌లను తొలగించారు. కానీ, అదృష్టవశాత్తు రైల్వే అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.

దీంతో ఆ ట్రాక్‌పై ప్రయాణించే పలు రైళ్లను బెంగళూరు, కేరళ వైపు మళ్లించారు. ఈ నేపథ్యంలోనే పలు ట్రైన్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆకతాయిలు చేసిన పనా..? లేదంటే, ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీ సేకరించారు. వాటి అధారంగా విచారణ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights