నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మసీదులో, కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా శుక్రవారం ముస్లిం మైనార్టీ నాయకులు సదర్ అక్బర్, ఇమామ్ రెహమాన్ ల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉగ్ర దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనందంగా గడుపుతున్న పర్యాటకులను విచక్షణారహితంగా కాల్చి చంపిన ఉగ్రవాదులు అని పిరికిపందల చర్య అని, దేశంలో మత చిచ్చు పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తప్పమన్నారు. దాడిలో చనిపోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు. అన్నారు. ఈ ప్రాంతాల్లో సరైన భద్రత కల్పించకపోవడం సహా దాడికి సంబంధించిన పలు కోణాల్లో తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు రఫిక్, అయ్యూబ్, సుజావుద్దీన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు

ఉగ్రదాడిపై మసీదులో నల్ల బ్యాడ్జీలతో ముస్లింల నిరసన –

Written by RAJU
Published on: