
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తీర్మానం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. అలాగే ఈ దాడి పాకిస్తాన్ ప్రేరేపితం, హిందువులను లక్ష్యంగా చేసి దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు జరిగిన కుట్ర అని పేర్కొంది. ఈ దాడి రెచ్చగొట్టే చర్య అయినప్పటికీ, ప్రజలు శాంతిని కాపాడాలి, ఐక్యంగా నిలబడాలి పిలుపునిచ్చింది. పర్యాటకులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన స్థానిక పోనీవాలా, గైడ్‌లకు నివాళులు అర్పించింది. దాడి తర్వాత ప్రధానమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరపాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది సీడబ్ల్యూసీ వెల్లడించింది.
పహల్గామ్‌లో మూడంచెల భద్రత ఉన్నప్పటికీ దాడి జరగడం వెనుక భద్రతా వైఫల్యాలపై సమగ్ర విశ్లేషణ అవసరం మని అభిప్రాయపడింది. రాబోయే అమర్‌నాథ్ యాత్రకు లక్షలాది యాత్రికుల భద్రతను జాతీయ ప్రాధాన్యతగా పరిగణించి, బలమైన, పారదర్శక భద్రతా ఏర్పాట్లు చేయాలి కోరింది. జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకంపై ఆధారపడిన ప్రజల జీవనోపాధిని రక్షించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచింది. ఈ విషాదాన్ని బీజేపీ సోషల్ మీడియా విభజన రాజకీయాల కోసం వినియోగిస్తోందని, ఐక్యత అవసరమైన సమయంలో ఇలాంటి పనులు దురదృష్టకరమని విమర్శించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..