హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): భారీ రుణభారం, సంక్ష్లిష్ట ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రభుత్వం సాహాసోపేతమైన బడ్జెట్ ప్రవేశ పెట్టిందని.. తీపి, చేదు కలగలుపు ఉగాది పచ్చడిలా 2025-26 బడ్జెట్ ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. హామీల అమలు, సంక్షేమం, అభివృద్ధిలో సమతౌల్యంకోసం ప్రభుత్వం ప్రయత్నించిందని పేర్కొన్నారు. గొప్పలకు పోయి బడ్జెట్ అంచనాలు పెంచకుండా.. ఉన్నంతలో పన్నుల భారం లేకుండా వాస్తవికంగా బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నారు. ఆరు గ్యారెంటీలకు రూ.56 వేల కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1.04 లక్షల కోట్లు కేటాయించడాన్ని సీపీఐ స్వాగతిస్తోందన్నారు.