ABN
, Publish Date – Mar 21 , 2025 | 11:50 PM
శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది.

ఉగాది ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెక్యూరిటి సిబ్బందిని, శివసేవకులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిదంగా క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కైలాసద్వారం వద్ద కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన శివసేవకులు పాదయాత్రగా వస్తున్న భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న జొన్నరొట్టెలను ఈఓ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఇంజనీరు ఎం.నరసింహారెడ్డి, ఏఈవోలు జి.స్వాములు, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date – Mar 21 , 2025 | 11:50 PM