ABN
, Publish Date – Apr 25 , 2025 | 01:13 AM
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 1,533 రోజులుగా కూర్మన్నపాలెంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించి, సంఘీభావం తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
కూర్మన్నపాలెంలో దీక్షల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం
కూర్మన్నపాలెం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి):
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 1,533 రోజులుగా కూర్మన్నపాలెంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించి, సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం ఉక్కు కర్మాగార పరిస్థితి, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు, గత ఎనిమిది నెలలుగా అరకొర జీతాల చెల్లింపు తదితర వివరాలను ఆమెకు పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్ వివరించారు. ప్యాకేజీ వల్ల కర్మాగారానికి, కార్మికులకు ఒరిగేదేమీ లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, తన తాబేదార్లకు కట్టబెట్టాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందించాలని షర్మిలను అభ్యర్థించారు. ఉక్కు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అందుకు ఆమె స్పందిస్తూ కార్మికులకు అండగా ఉంటానని, మరోమారు వచ్చి దీక్షలలో కూర్చుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు జె.రామకృష్ణ, కేఎస్‌ఎన్ రావు, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు, వెంకటేశ్వరరావు, వి.ప్రసాద్, పలువురు ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date – Apr 25 , 2025 | 01:13 AM