ఈ సమ్మర్‌లో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Written by RAJU

Published on:

ఈ సమ్మర్‌లో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌హీరో ప్రదీప్‌ మాచిరాజు నటించిన తాజా సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దీనికి నితిన్‌, భరత్‌ దర్శకత్వం వహించారు.  మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బ్యానర్‌ నిర్మించిన ఈ చిత్రంలో దీపికా పిల్లి కథానాయికగా నటించింది. ఈ సినిమా వేసవి కానుకగా ఈనెల 11న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకులు నితిన్‌, భరత్‌ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. మేం టెలివిజన్‌లో డిఫరెంట్‌ షోస్‌ చేశాం. అప్పటినుంచి ప్రదీప్‌ పరిచయం. ఆయనతో చాలా క్రియేటివ్‌ థాట్స్‌ షేర్‌ చేసుకుంటాం. ఒకసారి ఈ కథ ఐడియా చెప్పాం. బావుం దన్నారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పవన్‌ కళ్యాణ్‌ సినిమా టైటిల్‌. ఈ సినిమాకి ఈ టైటిల్‌ యాప్ట్‌ అవుతుంది కాబట్టే తీసుకున్నాం. ఇందులో కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. బ్రహ్మానందం, సత్య.. ఇలా పాత్రలన్నీ కథలో ఆర్గానిక్‌గా ఉంటాయి. ఆ పాత్రలను ఆడియన్స్‌ బాగా ఎంజారు చేస్తారు. ప్రదీప్‌, దీపికాపిల్లి అద్భుతంగా నటించారు. మా డిఓపి బాల్‌ రెడ్డి, మ్యూజిక్‌ రథన్‌ అద్భుతమైన వర్క్‌ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్‌ వారికి సినిమా చాలా నచ్చింది. ఇది సమ్మర్‌కి రావాల్సింది సినిమా అని వారే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజారు చేసే సినిమా ఇది. ఖచ్చితంగా అందరిని ఎంటర్టైన్‌ చేస్తుంది.

Subscribe for notification
Verified by MonsterInsights